పెద్ద సినిమాల రా-ఫుటేజ్ దొంగిలించిన వ్య‌క్తి అరెస్ట్‌

Sun,August 12, 2018 08:24 AM
police handover the hard disk of big budget movies

టాలీవుడ్‌కి షాక్ ఇచ్చే సంఘ‌ట‌న తాజాగా జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌తో చిత్ర పరిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. రాజేష్ అనే సినిమా ఎడిట‌ర్ ద‌గ్గ‌ర పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న సినిమాల‌కి సంబంధించిన రా ఫుటేజ్ దొరికింది. ఇందులో టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్ న‌టించిన అరవింద స‌మేత‌, మ‌హేష్ బాబు మ‌హ‌ర్షిల చిత్రాల‌తో పాటు ఈ నెల 15న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న గీత గోవిందం , ట్యాక్సీవాలా చిత్రాల‌కి సంబంధించిన ఫుటేజ్ ఉన్న‌ట్టు గా తెలుస్తుంది. రీసెంట్‌గా అర‌వింద స‌మేత ఎడిటింగ్ ఇమేజెస్ కొన్ని బ‌య‌ట‌కి రావ‌డంతో ఇలాంటింది ఏదో జ‌రిగి ఉంటుంద‌ని అంద‌రిలో అనుమానం వ్య‌క్తం అయింది. తాజాగా లీకేజ్‌ల‌పై దృష్టి సారించిన సైబ‌ర్ పోలీసులు రాజేష్ అనే వీడియో ఎడిట‌ర్‌ని అరెస్ట్ చేశారు. ఐపీ ఆడ్రస్‌ను ట్రేస్ చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లోకి గుంటూరుకు చెందిన 17 మంది విద్యార్థులకు ఈ సైబర్ క్రైమ్‌లో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో రెండు రోజుల్లో మరికొంత మంది విద్యార్ధుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫుటేజ్‌ని ఎవ‌రికి షేర్ చేయ‌లేదని పోలీసులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ కేసుకి సంబంధించిన నేర‌స్థులు ఎవ‌రైన ఉన్నార‌నే దానిపై పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.


2329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles