కారులో ఉన్న‌ది హీరో రాజ్‌త‌రుణ్: పోలీసులు

Wed,August 21, 2019 11:17 AM
police booked a case against raj tarun

సోమవారం అర్ధ‌రాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ వంద అడుగుల రహదారి మలుపువద్ద ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఓ కారు అతివేగంగా వచ్చి ఖాళీ ప్లాటు గోడను ఢీకొట్టి నిలిచిపోయింది.. వేగంగా వచ్చి ఢీకొనడంతో గోడ కూలిపోయింది. ఆ త‌ర్వాత‌ ఘటనాస్థలం నుంచి ఒక వ్యక్త్తి కారును వదిలేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. ఈ ఫుటేజీని పరిశీలించిన స్థానికులు పారిపోతున్న వ్యక్తి సినీహీరో రాజ్‌తరుణ్‌ అని అనుమానించారు. కాని ఆ కారు రాజ్‌తరుణ్‌ది కాదని, అందులో ఆయన లేరని, ఇంట్లోనే ఉన్నారంటూ కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు టీఎస్‌ 09 ఈఎక్స్‌ 1100 నెంబ‌ర్ ఉన్న కారు, లీడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినదని, ప్రదీప్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ ఉన్నట్టు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు కారులో ఉన్న వ్య‌క్తి హీరో రాజ్ త‌రుణ్ అని నిర్ణ‌యించారు. సుమోటో కింద ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం అజ్ఞాతంలో ఉన్న రాజ్ త‌రుణ్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

2938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles