'సూర్య‌కాంతం' నుండి ఎమోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

Sat,March 16, 2019 08:52 AM
Po Pove Lyrical Song from Suryakantam

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిహారిక‌, రాహుల్ విజ‌య్, ప‌ర్లీన్ బ‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం సూర్య‌కాంతం. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్రంకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ చిత్ర టీజ‌ర్‌తో పాటు ప‌లు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మ‌రో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. పో పోవే అంటూ సాగే ఈ పాట‌కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించ‌గా,మార్క్ కె రాబిన్ బాణీలు స‌మ‌కూర్చారు. కార్తీక్ ఆల‌పించాడు. ఎంతో ఎమోష‌న్‌కి తీసుకెళ్ళే ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles