వారం ముందే వ‌స్తున్న ‘పీఎం నరేంద్రమోదీ’

Tue,March 19, 2019 11:44 AM
PM Narendra Modi release preponed

భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుద‌ల అవుతుంద‌ని ముందుగా ప్ర‌క‌టించారు. కాని ప‌బ్లిక్ డిమాండ్ వ‌ల‌న చిత్రాన్ని వారం రోజుల ముందే రిలీజ్ చేస్తున్నామ‌ని నిర్మాత సందీప్ ఎస్ సింగ్ అన్నారు. చిత్రంలో మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మోదీ (వివేక్‌)కి సంబంధించి విభిన్న గెట‌ప్స్‌లో ఉన్న తొమ్మిది లుక్స్ విడుద‌ల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ముంబైలో చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతున్న‌ది. ఎక్కువ శాతం సినిమాను ఉత్త‌రాఖండ్‌లో షూట్ చేశారు. మోదీ బాల్యం, ఆ త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌వేశం గురించి సినిమాలో చూపించ‌నున్నారు. గుజ‌రాత్ సీఎం నుంచి 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీ సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని కూడా చిత్రంలో ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు .

1032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles