'పీఎం నరేంద్రమోదీ' ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,March 21, 2019 11:26 AM

బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పీఎం న‌రేంద్ర‌మోదీ. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నామ‌ని నిర్మాత సందీప్ ఎస్ సింగ్ అన్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల మోదీ (వివేక్‌)కి సంబంధించి విభిన్న గెట‌ప్స్‌లో ఉన్న తొమ్మిది లుక్స్ విడుద‌ల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని సన్నివేశాలు క‌మ‌ర్షియ‌ల్ సినిమా స్టైల్ మాదిరిగానే ఉన్నాయి. ట్రైల‌ర్‌లో మోదీ బాల్యంతో పాటు రాజ‌కీయ ప్ర‌వేశం, గోద్రా అల్ల‌ర్లు త‌దిత‌ర అంశాల‌ని చూపించారు.


పీఎం న‌రేంద్ర‌మోదీ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో సినీ నటుడు మనోజ్‌ జోషి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ శాతం ఉత్త‌రాఖండ్‌లో షూట్ చేశారు. గుజ‌రాత్ సీఎం నుంచి 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీ సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని కూడా చిత్రంలో ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు చిత్రయూనిట్.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles