మోదీని గుర్తు పట్టిన గుల్‌పనాగ్ కొడుకు..వీడియో

Thu,October 17, 2019 04:40 PM

సోషల్‌మీడియాలో ప్రధాని నరేంద్రమోదీ చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ఏడాదిన్నర కొడుకు నిహాల్ మేగజైన్ కవర్‌పేజీపై ఉన్న వ్యక్తిని గుర్తు పట్టి..ఆయనెవరు అని అడిగితే మోదీ అని చెప్పగా..గుల్‌పనాగ్ మోదీజీ అని నిహాల్‌కు చెబుతుంది.


మేగజైన్, న్యూస్‌పేపర్లలో నరేంద్రమోదీని ఇపుడు నిహాల్ స్పష్టంగా గుర్తుపడుతున్నాడని గుల్‌పనాగ్ ట్వీట్ చేసి మోదీకి ట్యాగ్ చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ..చాలా గొప్ప విషయం. చిన్నారి నిహాల్‌కు నా ఆశీస్సులు అందజేస్తున్నా. భవిష్యత్‌లో నిహాల్ కోరుకుంటున్న లక్ష్యాలు చేరుకోవాలి. నిహాల్ నీ (గుల్‌పనాగ్)లో ఓ మార్గదర్శకురాలిని, జడ్జిని గుర్తించారు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నిహాల్ మోదీ పేరు పలుకుతున్న వీడియోకు 70 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. మోడల్, నటి అయిన గుల్‌పనాగ్ పైలట్ రిషీ అట్టారీని పెళ్లి చేసుకుంది. వీరికి గతేడాది నిహాల్ జన్మించాడు.


2688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles