ఈసీ కార్యాలయానికి నటుడు వివేక్‌ ఒబెరాయ్‌

Thu,March 28, 2019 05:32 PM
PM Biopic Not a Violation of MCC vivek Oberoi Lawyer


న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం నోటీసుల నేపథ్యంలో.. ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్ర హీరో వివేక్‌ ఒబెరాయ్‌, నిర్మాత సందీప్‌ సింగ్‌ ఇవాళ ఈసీ ఎదుట హాజరయ్యారు. పీఎం నరేంద్రమోదీ సినిమా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా ఉందని కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసీకి వివరణ ఇచ్చిన అనంతరం వివేక్‌ ఒబెరాయ్‌ తరపు న్యాయవాది హితేశ్‌ జైన్‌ మాట్లాడుతూ..సినిమా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా లేదని..ఈ విషయంపై ఈసీకి వివరణ ఇచ్చామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీఎం నరేంద్రమోదీ చిత్రం బీజేపీకి రాజకీయంగా లబ్ధిచేకూర్చేవిధంగా ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

1563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles