ఎంఎల్‌ఏ ను తప్పకచూడండి: బ్రహ్మానందం

Mon,March 19, 2018 10:46 PM
Please watch MLA Movie says brahmanandam


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ కల్యాణ్‌రామ్ నటిస్తోన్న చిత్రం ‘ఎంఎల్‌ఏ’. ఉపేంద్రమాధవ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీతో కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. మార్చి 23న ఈ మూవీ విడులవుతుంది. ఈ సందర్భంగా మూవీ టీంకి విషెస్ తెలిపాడు బ్రహ్మీ. ఈ నెల 23న ఎంఎల్‌ఏ..మంచి లక్షణాలున్న అబ్బాయి సినిమా విడులవుతున్నది. నేను, పోసాని, పథ్వీ అతిరథమహారథులైన కమెడియన్స్ నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. కల్యాణ్‌రామ్ హీరోయిజం మిమ్మల్ని అలరిస్తుంది. ఈ వేసవిలో తేనేటి విందు లాంటి ఎంఎల్‌ఏ సినిమా తప్పక చూడండి అంటూ ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు బ్రహ్మీ. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.2447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles