క‌త్తి మ‌హేష్‌పై కోడి గుడ్ల‌తో దాడి..

Fri,January 19, 2018 10:08 AM
Pk fans attack on kathi mahesh

కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ నుండి అనేక వేధింపులు ఎదుర్కొంటున్నానంటూ క‌త్తి మ‌హేష్ అనేక ఇంట‌ర్వ్యూల‌లో చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొని కారులో తిరిగి వెళుతుండ‌గా, ఆయ‌న‌పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి కోడిగుడ్ల‌తో దాడి చేశారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్సే చేశారంటూ క‌త్తి మ‌హేష్ చెబుతున్నాడు. వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల‌ని తాను భావిస్తున్న‌ట్టు క‌త్తి అన్నాడు. అయితే మ‌హేష్‌పై దాడిని ఓయూ జేఏసీ ఖండిస్తూ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిష్టి బొమ్మ ద‌గ్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు. క‌త్తి మ‌హేష్ పై దాడి హైద‌రాబాద్‌లోని శిల్పారామం ద‌గ్గ‌ర జరిగిన‌ట్టు తెలుస్తుంది.

1636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS