సన్నీలియోన్ ఐటెం సాంగ్ అదిరింది

Tue,July 25, 2017 12:24 PM
Piya More Song from  Baadshaho

అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఇమ్రాన్ హ‌ష్మీ, ఇషా గుప్తా, సంజ‌య్ మిశ్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం బాద్ షాహో. 1975లో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఎమ‌ర్జెన్సీ విధించారు. అప్ప‌టి ప‌రిస్థితుల‌ నేప‌ధ్యంలో బాద్‌షాహో అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మిలాన్ లుత్రియా. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ మాత్రం మూవీపై భారీ అంచ‌నాలే పెంచుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు పోస్ట‌ర్స్ తో మూవీపై అంచ‌నాలు పెంచిన మేక‌ర్స్ తాజాగా పియో మోర్ అనే సిజ్లింగ్ సాంగ్ విడుద‌ల చేశారు. స‌న్నీ లియోన్ , ఇమ్రాన్ హ‌ష్మీల మ‌ధ్య సాగిన ఈ సాంగ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. వారిద్ద‌రి కెమిస్ట్రీ అదిరింద‌ని అంటున్నారు. అంకిత్ తివారీ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సాంగ్ కి మ‌నోజ్ ముంత‌షిర్ లిరిక్స్ అందించ‌గా, మికాసింగ్, నీతి మోహ‌న్ పాట పాడారు. మ‌రి ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

4282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles