శ్రీను వైట్ల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అఅఅ నుండి స‌ర్‌ప్రైజింగ్ వీడియో

Tue,September 25, 2018 09:46 AM
Pivot of Amar Akbar Anthony released

స్టార్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల చాలా గ్యాప్ త‌ర్వాత మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రం చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ‘వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి రీసెంట్‌గా గుమ్మడికాయ కొట్టేశారు. హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో చిత్రీకరించిన చివరి పాటతో షూటింగ్‌ పూర్తయింది. సోమ‌వారం శ్రీనువైట్ల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ర‌వితేజ మూడు పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని అలరిస్తుంది.

‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్‌’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మాస్ మ‌హారాజా ర‌వితేజ అభిమానుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని అంటున్నారు. అయితే శ్రీనువైట్ల బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేపించారు. బ‌ర్త్‌డే వేడుక‌లో వైట్ల ఫ్యామిలీతో పాటు గోపి మోహ‌న్, బీవీఎస్ ర‌వి, ర‌వితేజ, హ‌రీష్ శంకర్ పాల్గొన్నారు.

1546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS