అజిత్ 'నెర్కొండ పార్వాయి' చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,June 13, 2019 08:33 AM
Pink Remake trailer released

తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజిత్. ప్రస్తుతం బోని క‌పూర్‌ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రంగా నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచాయి. ఆ అంచ‌నాల‌ని మ‌రింత పెంచేలా తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. లాయ‌ర్ పాత్ర‌లో అజిత్ అల‌రించాడు. మిగతా నటీన‌టులు కూడా పాత్ర‌కి త‌గ్గ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రచిన‌ట్టు ట్రైలర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా త‌మిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్య‌గా విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఈమెకి ఈ చిత్రం త‌మిళంలో తొలి మూవీ . గిబ్రాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు . అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles