పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ పూర్తి..త్వర‌లోనే టీజర్ విడుద‌ల‌

Wed,April 3, 2019 09:56 AM
Pink Remake shooting competed

త‌మిళ స్టార్ హీరో అజిత్ ఇటీవ‌ల విశ్వాసం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక కొద్ది రోజులుగా పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు అజిత్‌. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బోనీకపూర్ నిర్మిస్తున్నారు. నెర్కొండ పార్వాయి అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అజిత్‌కి 59వ చిత్రం కాగా, ఇందులో త‌మిళ నేటివిటీకి అనుగ‌ణంగా ప‌లు మార్పులు చేసి తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో అజిత్ కోట్ వేసుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు బోనులో నిల్చొని ఉన్నారు.

నిన్న‌టితో ఈ చిత్ర షూటింగ్ పూర్తైంద‌ని కోలీవుడ్ స‌మాచారం. వీలైనంత వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని టీం భావిస్తుంది. అయితే ఈ నెల‌లో చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. విద్యా బాలన్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. యువన్‌ శంకర్‌రాజా చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు . అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

1023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles