ఆధ్యాత్మిక యాత్రలో రజనీకాంత్: వీడియోలు వైరల్

Tue,March 13, 2018 03:18 PM
Pics From Rajinikanths Himalayan Pilgrimageఢిల్లీ: ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హిమాలయాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి రజనీ ఇలాంటి పర్యటనలకు తరచుగా వెళ్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ రజనీకాంత్ ఈ యాత్రకు వచ్చిన విశేషాలు, ఫొటోలు బయటకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఐతే ఇటీవల రాజకీయాల్లో వస్తానని ప్రకటించడంతో అభిమానులు, మీడియా మొత్తం తలైవా మీద దృష్టి పెడుతోంది. యాత్రలో సూపర్‌స్టార్‌ను చూసిన అభిమానులు ఆయన వెంట పరుగెడుతూ సెల్పీలు తీసుకుంటున్నారు. జమ్ముకు సమీపంలోని రేసీ జిల్లాలోని శివాలయాన్ని రజనీకాంత్‌ సందర్శించుకుని పూజలు చేస్తున్న ఫొటోలను రజనీకాంత్ ఆర్మీ పేరుతో ఉన్న ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో హిమాలయాల్లో రజనీ గుర్రంపై వెళ్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.1783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS