సాహో సెట్‌లో రొమాంటిక్ లుక్‌లో ప్రభాస్, శ్రద్ధ.. ఫోటో వైరల్

Mon,April 15, 2019 06:12 PM
Pic of Shraddha Kapoor And Prabhas From The Sets Of Saaho goes viral

ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు.. సారీ సారీ.. భారత సినీ అభిమానులు కళ్లకు కాయలయ్యేలా ఎదురు చూస్తున్న సినిమా సాహో. అవును.. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మొదటిసారిగా తెలుగులో నటిస్తుండటం, అది కూడా ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్‌తో కలిసి నటిస్తుండటం.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో వస్తుండటం.. ఇవన్నీ ఆసక్తిని పెంచాయి. అందుకే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ తప్పించి ఇంకేమీ రిలీజ్ కాలేదు. సాహో సెట్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు అప్పుడప్పుడు లీక్ అవుతున్నా.. అవి అంతగా మెప్పించలేదు. ఇటీవలే శ్రద్ధా కపూర్ బర్త్‌డే సందర్భంగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. మేకింగ్ వీడియో చూశాక.. సినిమా హాలీవుడ్ రేంజ్‌ను దాటిపోతుందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజాగా సినీ అభిమానుల కోసం సాహో సెట్‌లో ప్రభాస్, శ్రద్ధ రొమాంటిక్‌గా ఒకరిని మరొకరు చూస్తూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోను శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ పేజీలో పోస్ట్ చేశారు. అంతే.. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దొరక్క దొరక్క వాళ్లకు ఓ ఫోటో దొరికింది. అంతే.. దాన్ని వైరల్ చేసేస్తూ.. దానిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సాహో సినిమా తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి రూపుదిద్దుకుంటోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15, 2020న సినిమా రిలీజ్ కానుంది.2143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles