జాన్వీకపూర్ ను సారా అని పిలిచి..వీడియో

Wed,January 23, 2019 07:22 PM

సారా అలీఖాన్, జాన్వీకపూర్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అందంలో, నటనలోనూ ఒకరిని మించి మరొకరు తరచూ పోటీపడుతూ ఉంటారు. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా..వారు సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. జాన్వీ, సారా ఇద్దరు మంచి స్నేహితులు కూడా. అయితే ఇటీవల జాన్వీకపూర్ ను ఓ ఫొటోగ్రాఫర్ సరదాగా ఆటపట్టించాలనుకున్నాడు. జాన్వీకపూర్ ను సదరు ఫొటోగ్రాఫర్ సారా జీ అని పిలిచాడు. అయితే ఆ పిలుపు విన్న జాన్వీ మాత్రం చిరునవ్వులు చిందించింది. అతను (ఫొటోగ్రాఫర్ )కావాలనే అలా పిలుస్తున్నాడంటూ చురకలంటించింది జాన్వీ. ఈ వీడియో ఇపుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

3001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles