ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెంచిన ర‌జ‌నీకాంత్‌

Fri,December 28, 2018 10:51 AM
petta trailer released

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాడు. ఇటీవ‌ల 2.0 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన త‌లైవా జ‌న‌వ‌రి 10న‌ పేట అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్, వీడియోస్‌ల‌లో ర‌జనీకాంత్ లుక్ స‌రికొత్తగా ఉండ‌డంతో అభిమానులు పేట మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. భారీ స్థాయిలో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తుండ‌గా తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటి వారంలో భారీగా, విభిన్నంగా నిర్వహించనున్నట్లు స‌మాచారం. కార్తీక్‌ సుబ్బరాజ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన పేటా చిత్రంలో రజనీ అభిమానులను ఆకట్టుకొనే అంశాలు చాలానే ఉంటాయ‌ట‌. త్రిష గ్లామర్‌, సిమ్రన్‌ అభినయం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంద‌ని అంటున్నారు . చిత్రంలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు.

1896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles