థీమ్ సాంగ్‌లో ఆక‌ట్టుకుంటున్న ర‌జ‌నీకాంత్ స్టిల్స్‌

Sat,December 15, 2018 09:51 AM
Petta Paraak Tamil Lyric video released

ఇటీవ‌ల 2.0 అనే చిత్రంతో అల‌రించిన ర‌జ‌నీకాంత్ సంక్రాంతికి పేటా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి మేక‌ర్స్ వినూత్నంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన స్టిల్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. మ‌ర‌ణ మాస్‌, ఊల్ల‌లా సాంగ్స్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. ర‌జనీకాంత్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్‌లో తలైవ‌ర్‌ని చూసి ఫ్యాన్స్ ఎగిరి గంతులేశారు. టీజ‌ర్‌లో ర‌జ‌నీకాంత్ లుక్స్‌ భాషా మూవీని గుర్తు చేస్తున్నాయి అంటూ చ‌ర్చించుకున్నారు. అయితే తాజాగా చిత్రానికి సంబంధించి థీమ్ సాంగ్ విడుద‌ల చేశారు. పేటా ప‌రాక్ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌లో ర‌జ‌నీకాంత్ లుక్ అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా చేస్తున్నాయి. ఇందులో ఎంతో స్టైలిష్‌గా క‌నిపిస్తున్న ర‌జ‌నీని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. వివేక్ లిరిక్స్ అందించిన ఈ థీమ్ సాంగ్‌ని అనిరుధ్ రవిచంద్ర‌న్ పాడారు. ఈ చిత్రంలో బాబీ సింహానవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్ర ఆడియోని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. చిత్రంలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles