ర‌జ‌నీకాంత్ బ‌ర్త్‌డే గిఫ్ట్ అదిరింది

Wed,December 12, 2018 11:09 AM
Petta Official Teaser released

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 2.0 చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అభిమానులలో ఈ సినిమా జోష్ త‌గ్గ‌క ముందే ర‌జ‌నీకాంత్ మ‌రో చిత్రం పేటా నుండి వ‌స్తున్న అప్‌డేట్స్ మ‌రింత జోష్‌ని పెంచుతున్నాయి. ఇటీవ‌ల ‘మరణ మాస్’ , ఊల్ల‌లా అనే సాంగ్‌ని విడుద‌ల చేసారు. ఈ సాంగ్స్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఈ రోజు ర‌జ‌నీకాంత్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో త‌లైవ‌ర్ లుక్స్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెంచుతున్నాయి. టీజ‌ర్‌లో ర‌జ‌నీకాంత్ లుక్ భాషా మూవీని గుర్తు చేస్తున్నాయి. ఈ సినిమా తప్ప‌క భారీ విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. సంక్రాంతికి రానున్న ఈ పేటా చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్ర ఆడియోని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. చిత్రంలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

2988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles