ప్రియాంక వెడ్డింగ్ ప్యాలెస్ ధ‌ర ఎంతో తెలిస్తే షాకే !

Sat,November 17, 2018 09:35 AM
Per Day Cost Of Priyanka Wedding Palace Blow Your Mind

గ‌త కొద్ది రోజులుగా సినీ అభిమానులు అంద‌రు దీపికా- ర‌ణ్‌వీర్‌ల పెళ్లి హంగామాలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి వెళ్ళ‌క‌పోయిన అక్క‌డి వివ‌రాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకొని ఆనందిస్తున్నారు. ఇక మ‌రి కొద్ది రోజుల‌లో దేశి గార్ల్ ప్రియాంక చోప్రా త‌న ప్రియుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకోనుండ‌గా, వీరి వివాహ వేదిక ఎక్క‌డ‌నే దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది. గ‌తంలో ప్రియాంకా, నిక్‌లు.. తమ పెళ్లి కోసం హవాయి దీవులను వేదికగా ఫిక్స్ చేసినట్లు వార్త‌లు రాగా, తాజాగా వీరి వెడ్డింగ్ వెన్యూగా జోధ్‌పూర్ ఉమైద్ భ‌వ‌న్ ప్యాలెస్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఒక రాత్రి ప్యాలెస్ ఖర్చు 6000 యూఎస్ డాలర్స్ అంటే మ‌న క‌రెన్సీ ప్ర‌కారం న‌ల‌బై మూడు ల‌క్ష‌లు. బాలీవుడ్ కాస్ట్‌లీ పెళ్ళిళ్ళ‌ల‌లో ప్రియాంక చోప్రా పెళ్ళి కూడా ఒక‌టిగా నిలుస్తుంద‌ని అంటున్నారు.

డిసెంబ‌ర్‌లో నిక్, ప్రియాంక చోప్రాల వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, ఈ నెలాఖ‌రు నుండి ప్రియాంక‌- నిక్‌ల పెళ్లికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మెహందీ, సంగీత త‌దితర కార్య‌క్ర‌మాల‌ని ఈ ల‌వ‌బుల్ క‌పుల్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే ప్రియాంక చోప్రా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి జోద్‌పూర్‌కి చెక్కేయ‌నుంది. అక్కడ దేసీ స్టైల్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుండగా, యూఎస్‌లో క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకోనున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌లే ప్రియాంక బ్యాచిల‌ర్ పార్టీతో బ్రైడ‌ల్ ష‌వ‌ర్ కూడా జ‌రుపుకున్న సంగ‌తి తెల‌సిందే. ఈ జంట తమ పెళ్లి ఫొటోల హక్కులను సుమారు 25 లక్షల డాలర్లు (సుమారు రూ.18 కోట్లు)కు అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో నిక్‌, ప్రియాంక‌లు నిశ్చితార్ధం జ‌రుపుకున్న విష‌యం విదిత‌మే.

3541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles