సినిమా ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చూస్తున్నారు!

Sun,November 11, 2018 02:39 PM
People In The Film Industry Conspiring Against Me says Govinda

బాలీవుడ్ నటుడు గోవిందా సంచనల ఆరోపణలు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు తన సినిమాలు రిలీజ్ కాకుండా కుట్ర పన్నుతున్నారని విమర్శించాడు. తన కొత్త మూవీ రంగీలా రాజాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకుండా 20 కట్స్ చెప్పడంపై గోవిందా ఆగ్రహం వ్యక్తంచేశాడు. నిజానికి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ రిలీజ్ అయ్యే నవంబర్ 8నే రంగీలా రాజా కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా.. సెన్సార్ బోర్డు కట్స్ చెప్పడంతో అది కాస్తా వాయిదా పడింది. దీనిపై గోవిందా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. 9 ఏళ్లుగా ఇలాగే జరుగుతున్నదని, ఇండస్ట్రీలో కొందరు తన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారని అతడు ఆరోపించాడు. ఈ సినిమాను సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ నిర్మించాడు. గత వారమే ఈయన సినిమాలో కట్స్‌ను వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

నిజానికి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ కంటే మూడు వారాల ముందే తమ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించినా.. ఆ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చిన బోర్డు.. తమ మూవీకి ఇవ్వలేదని నిహ్లానీ ఆరోపించాడు. లికర్ కింగ్, దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా వివాదాస్పద జీవితమే కథాంశంగా ఈ మూవీ తెరకెక్కడం విశేషం. ఇన్నాళ్లుగా తన సినిమాలకు అడ్డు పడుతున్నా సైలెంట్‌గా ఉన్నానని, ఇక ఏమాత్రం మౌనంగా ఉండదలచుకోలేదని గోవిందా స్పష్టం చేశాడు. గతంలో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలా లేదు. ఇప్పుడు మేము వేరే ప్రపంచంలో ఉన్నాం. పహ్లాజ్ నిహ్లానీలాంటి పెద్ద ప్రొడ్యూసర్ సినిమాల విడుదలనే ఆపేస్తున్నారు అని గోవిందా అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఆమిర్‌ఖాన్‌కు ఫేవర్‌గా ఉన్న ప్రస్తుత సీబీఎఫ్‌సీ చీఫ్ ప్రసూన్ జోషి.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాకు గడువులోపు క్లియరెన్స్ ఇచ్చారని పహ్లాజ్ నిహ్లానీ గతంలో ఆరోపించాడు. తన సినిమాకు అనవసర కట్స్ చెప్పారని విమర్శించాడు.

4727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles