బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డిగా సాగిన అవార్డుల కార్య‌క్ర‌మం

Sun,August 18, 2019 06:58 AM
people disguising their true colours in the house

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా నాలుగు వారాలు పూర్తి చేసుకోబోతుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా 16 మంది కంటెస్టెంట్స్‌తో సాగిన ఈ కార్య‌క్ర‌మం నుండి ఇప్ప‌టికే హేమ‌, జాఫ‌ర్‌, త‌మ‌న్నా ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజు మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం ఎలిమినేష‌న్‌లో ఏడుగురు స‌భ్యులు బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్‌, శివ జ్యోతి, వ‌రుణ్ సందేశ్ ఉండ‌గా శివ జ్యోతి, వ‌రుణ్ సేఫ్ అయ్యారు.

శ‌నివారం ఎపిసోడ్‌లో శుక్రవారం జ‌రిగిన హంగామాని మ‌న టీవీలో చూపించారు నాగార్జున‌. ఫేస్‌కి బ్లాక్ క‌ల‌ర్ ప్యాక్ పూసుకొని మ‌హేష్ ఉండ‌గా, ఆయ‌న ప‌క్క‌న కూర్చున్న బాబా భాస్క‌ర్ కొద్ది సేపు మ‌హేష్‌ని ఆట‌ప‌ట్టించాడు. ఆ త‌ర్వాత ఒకే సోఫాలో పున‌ర్న‌వి, రాహుల్ ప‌డుకొని ఉండ‌గా ఇలా ఉంటేనే మీమ్స్ వ‌చ్చేది అని రాహుల్ అంటాడు. ఆ త‌ర్వాత నువ్వు పిలిస్తేనే నేను ఇటు ప‌డుకున్నాను అంటూ సీరియ‌స్ అయి ప‌క్కకి వెళుతుంది పున‌ర్న‌వి. అంత‌లో అక్క‌డికి వ‌చ్చిన వితికా పున‌ర్న‌విని టీ పెట్ట‌మ‌ని చెప్ప‌డంతో ఆమె పెట్ట‌న‌ని చెబుతుంది. దీంతో సోఫా నుండి పునర్న‌విని ఎత్తే ప్ర‌య‌త్నం చేసిన వితికా తాను కింద ప‌డిపోతుంది.

ఈ వారం నాగార్జున బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని అవార్డుల‌తో స‌త్క‌రిస్తూ చుర‌కలు కూడా అంటించారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఒరిజినాలిటీని క‌వ‌ర్ చేసుకుంటున్నార‌ని, ఆ మాస్క్ తీసి బ‌య‌ట‌కి రావాల‌ని ఆయ‌న అన్నారు. ఈ క్ర‌మంలో ఇంటి స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌కి అనుగుణంగా ప‌లు అవార్డ్స్ ఇస్తూ చిన్న‌పాటి క్లాస్ పీకారు. ముందుగా బాబా భాస్కర్ కి బెస్ట్ కుక్కర్ అవార్డ్ అందించారు. ఆయ‌న మంచి వాడిని అనిపించుకునేందుకు అన్నీ లోప‌ల దాచుకుంటాడ‌ని నాగ్ చెప్ప‌గా, అలాంటి దేమి లేద‌ని మిగ‌తా వారికి కూడా త‌న గురించి తెలుసని వివ‌ర‌ణ ఇస్తారు బాబా.

ఇక పునర్నవి.. బెస్ట్ అంపైర్ గా ఎంపికైంది. గేమ్‌లో ఆడ‌టం త‌క్కువ‌. వీక్ష‌కురాలిగా కూర్చొని నిర్ణ‌యాలు బాగా ఇస్తుంద‌ని నాగ్ అన‌డంతో, ఇంకో సారి అలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటా అని చెబుతుంది. ఇక బిగ్ మౌత్ అవార్డు.. రాహుల్ అందుకున్నారు. ముందు ఒక‌లా ఉండి వెనుక మ‌రోలా ఉంటావు. శ్రీముఖి విష‌యంలో ఆమె ముందు సారీ చెప్పి వెనుక కామెంట్ చేశావు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. ఆ మాస్క్ తొల‌గించి మంచి గేమ్ ఆడు అని నాగ్ ఆయ‌న‌కి స‌ల‌హా ఇచ్చారు. ఇక బెస్ట్ బనానా (ఆటలో అరటిపండు) అవార్డ్.. అషు రెడ్డి అందుకుంది. గేమ్‌లో తాను ఆట‌లో అర‌టిపండు లానే ఉంటుంద‌ని అందుకే ఈ అవార్డు అందిస్తున్న‌ట్టు నాగ్ తెలిపారు

పుల్ల‌లు పెట్టే అవార్డు.. మహేష్ విట్టా అందుకున్నాడు. క‌నప‌డ‌కుండా ఇక్క‌డి విష‌యాలు అక్క‌డికి, అక్క‌డి విష‌యాలు ఇక్క‌డికి బాగానే పాస్ చేస్తావు అని నాగ్ అన‌గానే, ఇలా చేస్తేనే వ‌ర్కవుట్ అవుతుంద‌ని చెబుతాడు మ‌హేష్‌. ఇక బెస్ట్ బూతద్దం అవార్డ్ .. వితికా షెరు అందుకుంది. ప్ర‌తి విష‌యాన్ని బూత అద్దంలో పెట్టి చూస్తుంద‌ని, అది మార్చుకోమ‌ని వితికాకి స‌ల‌హా ఇచ్చారు నాగ్. ఇక లౌడ్ స్పీకర్ అవార్డ్‌.. శ్రీముఖి అందుకుంది. నీ ఎనర్జీ సూపర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే రైమ్‌ని హై పిచ్ లో చెప్ప‌మ‌ని నాగ్ చెప్ప‌డంతో హౌజ్ బ‌ద్ద‌ల‌య్యేలా అరుస్తూ చెబుతుంది.

బెస్ట్ ఆనియన్ కట్టర్ అవార్డ్ .. శివజ్యోతి అందుకుంది. ప్ర‌తి దానికి ఎమోష‌న‌ల్ అయి ఏడుస్తూ ఉండ‌డంతో త‌న‌కి ఆ అవార్డ్ అందించారు. ఇక బెస్ట్ ఫ్రూట్ అవార్డ్‌.. వరుణ్ సందేశ్ అందుకున్నాడు. గేమ్ ఆడే విష‌యంలో వ‌రుణ్ చాలా సార్లు మోస‌పోతుండ‌డంతో ఈ అవార్డ్ అందించారు. ఇక బెస్ట్ కత్తెర అవార్డ్‌.. రోహిణి అందుకుంది. అన్ని విష‌యాల‌ని మ‌ధ్య‌లోనే క‌ట్ చేసి వేరే టాపిక్‌కి వెళుతున్న కార‌ణంగా ఈ అవార్డ్ అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఇక బెస్ట్ ఇయర్( చెవి) అవార్డ్.. రవిక్రిష్ణ అందుకున్నాడు. ఎవ‌రు ఏది చెప్పిన ఓపిక‌గా వింటాడు కాబ‌ట్టి ఈ అవార్డు ఇస్తున్న‌ట్టు తెలిపారు నాగ్‌.

మొత్తానికి సంద‌డిగా సాగిన అవార్డుల కార్య‌క్ర‌మం త‌ర్వాత శివ జ్యోతితో పాటు వ‌రుణ్‌ని సేఫ్ జోన్‌లోకి పంపిన నాగార్జున ఈ రోజు ఒక‌రిని ఇంటి నుండి పంపించ‌నున్నారు. దీంతో ఇంటి స‌భ్యుల‌లో టెన్ష‌న్ మొదలైంది. ఎవ‌రు వెళ‌తార‌నే స‌స్పెన్స్ ఆడియ‌న్స్‌లోను అంత‌కి అంత పెరుగుతుంది. నామినేష‌న్‌లో ఉన్న ఏడుగురిలో ఇద్ద‌రు సేఫ్ కాగా ప్ర‌స్తుతం బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్ ఎలిమినేష‌న్‌లో ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ‌తారో చూడాలి.

1640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles