పెళ్లి చూపులు రీమేక్ ఫస్ట్ లుక్

Fri,March 31, 2017 11:53 AM
peeli choopulu remake first look

విజయ్ దేవరకొండ మరియు రీతూ వర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పెళ్లి చూపులు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. త‌రుణ్ భాస్క‌ర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29, 2016న విడుద‌లై సూపర్‌ హిట్ట‌య్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుండి ఈ సినిమాకు మంచి ప్ర‌శంస‌లు దక్కాయి. అయితే పెళ్ళి చూపులు చిత్రాన్ని ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఈ చిత్రాన్ని తమిళం, కన్నడలోను రీమేక్ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తమిళ సినిమా రీమేక్ రైట్స్ ను గౌతమ్ మీనన్ సొంతం చేసుకోగా, తాజాగా ఈ తమిళ చిత్రానికి పొన్ ఒండ్రు కండెన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. విష్ణు విశాల్, తమన్నా ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్ వీరసామి తెరకెక్కించనున్నాడు. తాజాగా చిత్ర పోస్టర్ ని కామిక్ బొమ్మల రూపంలో విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. పెళ్లి చూపులు చిత్రం కన్నడలోను రీమేక్ కానుందనే టాక్ నడుస్తుంది. గురునందన్, శ్రద్ధా శ్రీనాథ్‌లు ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ మురళీ తెరకెక్కించనున్నాడని చెబుతున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది.

2007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS