యూత్‌కి కిక్కిస్తున్న నితిన్ పెద్ద‌పులి సాంగ్‌

Sat,March 10, 2018 08:15 AM

నువ్ పెద్దపులి.. నువ్ పెద్దపులి.. అనే సాంగ్ ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ్లిలలో, జాత‌ర‌లో, పార్టీలో ఈ సాంగ్‌కి ఉన్న డిమాండే వేరు. ఇప్పుడు ఇదే సాంగ్‌తో సంద‌డి చేస్తున్నాడు నితిన్‌. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టించిన చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేయ‌గా, కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా థ‌మ‌న్ సంగీతంలో రూపొందిన పెద్ద‌పులి సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఇది యూత్‌కి మాంచి కిక్ ఇస్తుంది. తెలంగాణ యాస‌తో ఫుల్ మాస్ బీట్‌గా అదిరిపోయింది. మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ మూవీ నితిన్ ఫ్యాన్స్‌ని త‌ప్ప‌క అలరిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.


11126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles