పెద్ద‌పులి సాంగ్ మేకింగ్ వీడియో

Fri,March 30, 2018 09:26 AM
pedda puli song making

నువ్ పెద్దపులి.. నువ్ పెద్దపులి.. అనే సాంగ్ ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ్లిలలో, జాత‌ర‌లో, పార్టీలో ఈ సాంగ్‌కి ఉన్న డిమాండే వేరు. కొద్ది రోజులుగా ఇదే సాంగ్‌తో సంద‌డి చేస్తున్నాడు నితిన్‌. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టించిన చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేయ‌గా, ఇటీవ‌ల ఆడియోని విడుద‌ల చేశారు. సాంగ్స్ అన్నింటికి మంచి రెస్పాన్స్ రాగా, పెద్ద‌పులి సాంగ్ మాత్రం యూత్‌కి మంచి కిక్ ఇస్తుంది. థ‌మ‌న్ సంగీతంలో రూపొందిన పెద్ద‌పులి సాంగ్ తెలంగాణ యాస‌తో ఫుల్ మాస్ బీట్‌గా అదిరిపోయింది. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోని నితిన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇది నితిన్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌తి ఒక్కరిని అల‌రించేలా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.


2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles