జ‌య‌సుధ పాత్ర‌లో ఆర్ఎక్స్ 100 భామ‌ ..!

Sun,November 25, 2018 12:17 PM
Payal Rajput plays jayasudha role in ntr

ఆర్ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన గ్లామ‌ర్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో బోల్డ్ క్యారెక్ట‌ర్ పోషించిన పాయ‌ల్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో ఈ అమ్మ‌డికి వ‌రుస పెట్టి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల‌కి సంబంధించిన ప‌లు ప్రాజెక్టులు ప్ర‌స్తుతం పాయ‌ల్ చేతిలో ఉండ‌గా, టాలీవుడ్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్‌లో పాయ‌ల్‌ని జ‌య‌సుధ పాత్ర‌కి ఎంపిక చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. గతంలో ఎన్టీఆర్ - జయసుధ కాంబినేషన్ లో డ్రైవర్ రాముడు , గజదొంగ , మహా పురుషుడు వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఈ నేప‌థ్యంలో జ‌య‌సుధ కోసం ‘ఆర్‌ఎక్స్100’ భామ పాయల్ రాజ్‌పుత్‌ని క్రిష్ ఎంపిక చేశాడ‌ని స‌మాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో పలు పాత్రల కోసం రకుల్ ప్రీత్, విద్యాబాలన్, రానా, సుమంత్ లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్‌ని ఎంపిక చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రెండు పార్టులుగా విడుద‌ల కానుంది.

3259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles