పాయ‌ల్ రాజ్‌పుత్ 'ఆర్‌డీఎక్స్' మూవీ లాంచ్

Sun,March 31, 2019 11:37 AM
Payal Rajput movie launched today

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌. కెరియ‌ర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మ‌డు ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. డిస్కోరాజా చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ అమ్మ‌డు వెంకీ మామ‌లో వెంక‌టేష్‌తో జోడీ క‌ట్టింది. ఇక ఇప్పుడు పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్క‌నున్న ఆర్‌డీఎక్స్ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందించ‌నున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్య‌త ఉన్న చిత్రంగా ఉంటుంద‌ని అంటున్నారు.1601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles