మ‌న్మ‌థుడు 2లో ఛాన్స్ కొట్టేసిన పాయ‌ల్ రాజ్‌పుత్‌

Sat,February 2, 2019 08:43 AM

నాగార్జున కెరీర్‌ని పూర్తిగా మార్చేసిన చిత్రాల‌లో మ‌న్మ‌థుడు ఒక‌టి. ఈ సినిమాతో నాగ్ మ‌న్మ‌థుడిగా మారాడు. ఆయ‌న‌ని తన అభిమానులు ఇప్ప‌టికి టాలీవుడ్ మన్మథుడు అంటూ ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. 2002, డిసెంబర్ 20న విడుదలైన మన్మధుడు చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ చిత్రంలో నాగ్ ఎంతో స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాడు. దీంతో అప్పటి నుండి నాగ్ కి టాలీవుడ్ మన్మథుడు అనే బిరుదుని కట్టపెట్టారు ఆయన అభిమానులు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మన్మథుడు అనే మూవీ తెరకెక్కగా ఇందులో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇప్పడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మరియు మాటలు అందించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.


ఇటీవ‌ల 15 ఏళ్లు పూర్తి చేసుకున్న మ‌న్మ‌థుడు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు .ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఒక క‌థ‌నాయిక‌గా ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే ర‌వితేజ డిస్కోరాజా చిత్రంలో ఆఫ‌ర్ కొట్టేసిన‌ ఈ అమ్మ‌డకి త‌క్కువ టైంలో నాగ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రావ‌డం అదృష్ట‌మే మ‌రి. సీత చిత్రంలోను పాయ‌ల్ ఓ స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించ‌నుంద‌ట.

3527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles