పుకార్ల‌ని కొట్టిపారేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ

Sun,May 5, 2019 09:33 AM
Payal Rajput gives clariy on rx 100 sequel

ఆర్‌ఎక్స్100 సినిమాతో కథానాయికగా పరిచయం అయిన పాయల్‌ రాజ్‌ఫుత్ ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది . తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్ర‌స్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది పాయ‌ల్‌. ఇక‌ సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెం గార్ల్ అవతారమెత్తింది. అలాగే `RDX ల‌వ్‌` అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తుంది.సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భాను శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల పలు రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొట్టాయి. `RDX ల‌వ్‌` చిత్రం `RX 100`కు సీక్వెల్ అని జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిపై ఈ పంజాబీ భామ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. `RX 100`కు `RDX ల‌వ్‌`సీక్వెల్ కాద‌ని.. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ అని పేర్కొంది. దీంతో ఇన్నాళ్ళు చ‌క్క‌ర్లు కొట్టిన పుకార్ల‌కి బ్రేక్ ప‌డింది.

2088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles