త‌మ్ముడు త‌ప్పి పోయాడ‌ని ఆర్ఎక్స్ 100 భామ పోస్ట్‌

Mon,January 21, 2019 12:41 PM
payal rajput emotional post in instgram

ఆర్ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన గ్లామ‌ర్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో బోల్డ్ క్యారెక్ట‌ర్ పోషించి ప్ర‌శంస‌లు అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల‌కి సంబంధించిన ప‌లు ప్రాజెక్టులతో బిజీగా ఉంది పాయ‌ల్‌. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న త‌మ్ముడి ఫోటోని షేర్ చేస్తూ .. 2016 మార్చ్‌ 27న ముంబయిలో రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి నా త‌మ్ముడు వెళ్లిపోయాడు. సోదరుని గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం అని కామెంట్ పెట్టింది. అంతేకాదు 25 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న అత‌ను మ‌మ్మ‌ల్ని వ‌దిలి వెళ్లి మూడేళ్ళు కావొస్తుంద‌ని తెలిపింది.

పాయ‌ల్ త‌న త‌మ్ముడి పేరు ధృవ్‌ రాజ్‌పుత్ అని తెలియజేస్తూ, త‌మ్ముడి గురించి ఎవరికైనా తెలిస్తే స‌మాచారం అందివ్వ‌గ‌ల‌ర‌ని కోరింది. నిన్న ధృవ్ పుట్టిన రోజు కావ‌డంతో అత‌నిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో ఈ పోస్ట్ పెట్టింది పాయ‌ల్‌. త‌మ్ముడిని చూడ‌కుండా ఉండ‌లేక‌పోతున్నామ‌ని అన్న పాయ‌ల్ దేవుడు త‌న త‌మ్ముడికి ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాలిని కోరింది. అమ్మ నాన్న‌లు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. నీ కోసం ఎన్నోప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. ఈ మెసేజ్ చూసి అయిన స్పందిస్తావ‌ని ఆశిస్తున్నాము. రాలేని ప‌రిస్థితిలో ఉంటే కాల్ అయిన చేయ‌గ‌ల‌వు అంటూ పోస్ట్‌లో తెలిపింది పాయ‌ల్‌. త‌మ్ముడు త‌ప్పిపోయిన‌ట్టు ముంబై పోలీసుల‌కి చాలా సార్లు ఫిర్యాదుచేసిన వారు ఇంత వ‌రకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదని అందుకే అత‌ని ఫోటోలు పోస్ట్ చేస్తున్న‌ట్టు పాయ‌ల్ త‌న కామెంట్‌లో పేర్కొంది

View this post on Instagram

My brother is missing ! It’s been 3 years u left us ,27th March,16 at 7pm from Mumbai ! Not a single day passed without, thinking of you, Not a single day passed without, hoping to see you again ! Today is your bday ... HAPPY BIRTHDAY BHAI ,May god give u a long and healthy life . Bhai plz jaha par bhi h plz plz aja ...Muma papa roz tere liye pray karte hai ,tujko bhot miss karte hai 😪,A part of them went with you and you left them in silent Tears ,they are dying everyday without you Sonu 😔 Hope you will find this msg ! If you are stuck somewhere,plz just try to call us once .. we are waiting for you bhai 🙏🏼 Lodged complaint several times @ mumbai police station but nothing worked out ,m uploading few pics of him ! Name- Dhruv Rajput Age -25 height 6’1” Last seen in mumbai ! If you have seen him or know his whereabouts u can contact ! #brother #brothermissing #Dhruvrajput #2016 #missingperson #missing #mumbai #plzhelp #FindDhruv 🙏🏼

A post shared by Payal Rajput (@rajputpaayal) on

2518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles