పాయ‌ల్ రాజ్‌పుత్ మాస్ మ‌సాలా సాంగ్

Wed,April 3, 2019 10:33 AM

ఆర్‌ఎక్స్100 సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పాయల్‌రాజ్‌ఫుత్ ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది . తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్ర‌స్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది పాయ‌ల్‌. అయితే సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెంగర్ల్‌గా అవతారమెత్తింది. సీత చిత్రం ఏప్రిల్ 25న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో పాయ‌ల్ న‌ర్తించిన ‘బుల్‌ రెడ్డి...’ అనే పెప్పీ మాస్‌ సాంగ్‌ని కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ పాటలో పాయల్ అభినయం, నృత్యాలు, గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


సీత చిత్రం ఓ అభినవ సీత కథ . ఆమె క్షేమం కోసం రాముడి లాంటి యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది చిత్రంలో చూపించారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్‌ గోమటం, అభిమన్యుసింగ్‌ నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని టీం చెబుతుంది.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles