ఆర్ ఎక్స్ 100తో స్టార్ ప్రొడ్యూస‌ర్ దృష్టిలో ప‌డ్డ హీరోయిన్‌

Sun,August 5, 2018 09:09 AM
payal gets crazy offer with top producer

త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా ప్రేమ‌లో విఫ‌ల‌మైన హీరో పాత్ర‌లో కార్తికేయ‌, ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేసే పాత్ర‌లో పాయ‌ల్ రాజ్ అద్భుతంగా న‌టించారు. వీరి న‌ట‌న‌కి సినీ ప్రేక్ష‌క‌లోకం కాస్త థ్రిల్‌గా ఫీలైంది. ఒక్క హిట్ తోనే చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి, హీరో కార్తికేయ‌కి పెద్ద బేన‌ర్ నుండి భారీ ఆఫర్స్ వ‌స్తున్నాయి. అజ‌య్ భూప‌తి త్వ‌ర‌లో నితిన్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. . ఈ సినిమాకు ఎన్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక క‌థానాయిక పాయ‌ల్ రాజ్‌పుత్ ఇప్ప‌టికే మ‌హేష్ సినిమాకి ఎంపికైన‌ట్టు తెలుస్తుండ‌గా, స్టార్ ప్రొడ్యూస‌ర్ సి. క‌ళ్యాణ్‌ ఈ అమ్మ‌డిని త‌న సినిమాలో క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

3632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles