ఇద్ద‌రు మెగాస్టార్స్‌తో ప‌వ‌ర్ స్టార్‌

Tue,August 28, 2018 12:53 PM
pawan with amitabh bachchan

ఒక‌రు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, మ‌రొక‌రు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. వీరిద్ద‌రి మ‌ధ్య ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆ ప‌క్క‌న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. వీరి క‌ల‌యిక సైరా సెట్లో జ‌రిగింది. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి సైరా మూవీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమితాబ్ రాజ‌గురువు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై మూవీ నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అమితాబ్ టీంతో క‌లిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. అదే స‌మయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా సెట్‌కి వెళ్ళారు. త‌న అభిమాన న‌టుడు.. అన్న‌య్య సినిమాలో న‌టిస్తున్నార‌ని తెలిసి, బిగ్ బీని క‌లిసేందుకు అక్క‌డికి వెళ్లారు ప‌వ‌న్‌. కొద్ది సేపు అమితాబ్ తో ముచ్చ‌టించిన త‌ర్వాత చిరు, అమితాబ్, చెర్రీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ఫోటో దిగారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇటీవ‌ల దేశ రక్షణ కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రజల్ని రక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ సత్తాని, సైనికుల గొప్పదనాన్ని తెలియజేస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. భారత దేశ ఆర్మీ గురించి ప్రముఖులు ఆర్మీ అధికారులు పలు సందర్భాల్లో తెలిపిన మాటలు కూడా అందులో ఉన్నాయి. అయితే ఆ ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ జై హింద్ అని తన దేశభక్తిని తెలియజేశారు అమితాబ్. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌.. అమితాబ్‌పై ఉన్న ప్రేమ‌ని ట్వీట్‌లో తెలిపిన సంగ‌తి తెలిసిందే.

2730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS