మెగా బ్ర‌ద‌ర్స్ రేర్ ఫోటో పోస్ట్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Fri,July 6, 2018 09:14 AM
pawan shared rare photo of mega brothers

మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, నాగ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసి చాలా రోజుల‌యింది. ప్ర‌స్తుతం చిరంజీవి సినిమాల‌తో బిజీ కాగా, నాగ‌బాబు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కి జడ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక సినిమాలు వ‌దిలేసిన ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీ అయ్యాడు. ఈ ముగ్గురిని ఒకే వేదికపై చూడాల‌ని అభిమానులు ఎంతో ఆశ‌తో ఉన్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ట్విట్ట‌ర్‌లో మెగా బ్ర‌దర్స్, వారి సిస్ట‌ర్స్ క‌లిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. అది నెల్లూరులో తీసుకున్న ఫొటో . అప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నాని చెప్పారు ప‌వ‌న్ . చాలాకాలం బ్రాంకైటిస్‌తో బాధపడి.. కోలుకున్న తర్వాత తీసుకున్న ఫోటో అది అని పవన్ వివరించారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అక్క మాధవీరావు, చెల్లెలు విజయదుర్గ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలో ప‌వ‌న్‌ని చూసిన అభిమానులు నివ్వెర‌పోతున్నారు.


3627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles