ఇక పవన్ షూటింగ్ మొదలు ..!

Tue,April 25, 2017 04:04 PM
pawan second schedule started

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. తొలి షెడ్యూల్ లో పవన్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, కుష్ బూ, రావు రమేష్, రఘు బాబు వంటి తారలపై చిత్రీకరణ జరిగింది. ఇక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యూనిట్ ఈ రోజు నుండి మే 3 వరకు సెకండ్ షెడ్యూల్ జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో ఒక్క పవన్ పైనే కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారట. హారిక అండ్ హాసిని బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడిగా నటించనున్నాడని అంటున్నారు. ఈ మూవీకి ఇంజనీర్ బాబు అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

1547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles