'జార్జ్ రెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Tue,November 12, 2019 12:29 PM

విద్యార్థి పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో 1965 నుంచి 1975 మ‌ధ్య ఎన్నో ఉద్య‌మాలు న‌డిపిన విద్యార్ధినాయ‌కుడు జార్జ్ రెడ్డి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్‌ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శం. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగు లేని నాయకుడుగా ఎదిగిన జార్జ్ రెడ్డిని చాలా చిన్న వయసులో కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. ఇప్పుడు ఆయ‌న జీవిత నేప‌థ్యంలో జార్జ్ రెడ్డి పేరుతో చిత్రం రూపొందుతుంది. 'దళం' అనే సినిమాను తెరకెక్కించిన జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైక్ మూవీస్, 3 లైన్స్ మూవీస్, సిల్లీ మంక్స్ స్టూడియోపై అప్పిరెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ యక్కంటి నిర్మిస్తున్నారు.

జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు)ను స్థాపించారు. ఉద్యమాల‌తో ఎంద‌రినో చైత‌న్య‌ప‌ర‌చిన జార్జ్ రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో 'వంగవీటి' ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. మనోజ్‌ నందన్‌, చైతన్య కృష్ణ, శత్రు, వినరు వర్మ, తిరువీర్‌, అభరు, ముస్కాన్‌, మహాతి ఇతర నటీనటులు. హీరో సత్య దేవ్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ ఫ్లే చేస్తున్నారు. మరాఠీ నటి దేవిక 'జార్జి రెడ్డి' తల్లి పాత్రలో కనిపించబోతుంది. న‌వంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబ‌ర్ 17న జ‌ర‌గ‌నుంది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కాబోతున్నారని అంటున్నారు. వెన్యూ వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్లడించ‌నున్నారు.

1913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles