లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్..!

Sun,May 14, 2017 07:48 AM
pawan kalyan remakes jolly llb2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సేఫ్ జోన్ లో వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇటీవల వేదాళం రీమేక్ తో కాటమరాయుడు అనే చిత్రాన్ని చేసిన పవన్ త్వరలో మరి కొన్ని రీమేక్స్ చేయనున్నట్టు సమాచారం.ఈ క్రమంలో అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని మొదట వెంకీ రీమేక్ చేస్తాడని అన్నారు, కాని ఈ బాల్ ప్రస్తుతం పవన్ కోర్టులో ఉందట. హారిక అండ్ హసీని క్రియేషన్స్ వారు ఇటీవల జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్ర రీమేక్ హక్కులు దక్కించుకోగా, ఈ చిత్రాన్ని పవన్ తోనే చేయాలని భావిస్తున్నారట. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రం బాలీవుడ్ లో కలెక్షన్ల సునామి సృష్టించింది. వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అదీకాక సామజిక పరమైన అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో పవన్ ఈ మూవీ పై ఫోకస్ పెట్టాడని సమాచారం. చూడాలి మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో.

1876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles