యాక్సిడెంట్ కారు పవన్ కళ్యాణ్ ది కాదంట..!

Fri,May 12, 2017 01:11 PM
pawan kalyan clarifies about benz car

ఎంపీ నారాయణ తనయుడు నిషిత్ కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. నిషిత్ బెంజ్ కారు మెట్రో పిల్లర్ ని ఢీకొట్టడంతో నిషిత్ అక్కడికక్కడే మరణించాడు. ఆయన మరణం అందరిని కలిచి వేసింది. సినీ సెలబ్రిటీలు కూడా నిషిత్ కి నివాళులు అర్పించారు. అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నిషిత్ నడిపిన కారు పవన్ కళ్యాణ్ ది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. కొందరు కారు ఫోటోతో పాటు పవన్ ఫోటోని పెట్టి మరీ ట్రెండ్ చేశారు. రామ్ చరణ్ పెళ్ళి వేడుక సమయంలో పవన్ ఆ కారులోనే చరణ్ ని కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాడని అన్నారు. ఇలా ఎన్నో రూమర్స్ సృష్టించారు. దీనిపై ఓ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి ఒకరు నిషిత్ నడిపిన కారు మీదేనా అని ప్రశ్నించగా.. అలాంటి కారు నాకు ఉండేది.. లోన్స్ కట్టలేక అమ్మేశాను. నేను వాడిన కారు తర్వాతి మోడల్.. నిషిత్ వాడిన కారు అని పవన్ గాసిప్ రాయుళ్ళకు గట్టి క్లారిటీ ఇచ్చాడు. దీంతో అన్ని రూమర్స్ కి బ్రేక్ పడ్డాయి.

2689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles