చిరు-త్రివిక్రమ్ మూవీ..పవన్ గెస్ట్ రోల్..?

Thu,November 2, 2017 07:39 PM


హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 151వ మూవీ ‘సైరా’పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న సైరా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లకముందే చిరు 152వ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. అంతేకాకుండా సిల్వర్‌స్క్రీన్‌పై చిరుతోపాటు పవన్‌కల్యాణ్ మరోసారి కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.


చిరు నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ సినిమాలో గెస్ట్‌గోల్‌లో మెరిసిన పవన్..త్రివిక్రమ్-చిరు కాంబో మూవీలో ఎక్కువ సేపే కనిపించనున్నాడట. సుమారు అరగంట పాటు పవన్ కల్యాణ్ గెస్ట్ రోల్ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ న్యూస్ విని తమ ఫేవరేట్ స్టార్లను ఒకేసారి సిల్వర్‌స్క్రీన్‌పై చూడొచ్చని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో పవన్ గెస్ట్ రోల్‌కు సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. పవన్‌కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. అనుఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

3377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles