రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ ముఖ్య అతిధిగా..

Wed,April 11, 2018 08:25 AM
pawan guest for Rangasthalam success meet

1980 కాలం నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్ , స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ సునామి సృష్టిస్తూనే ఉంది.సినిమా రిలీజై రెండు వారాలు దాటినా కూడా ఈ చిత్రానికి మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. చిత్రాన్ని భారీ హిట్ చేసిన కార‌ణంగా ప్రేక్ష‌కుల‌కి, అభిమానుల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక ఈ మూవీ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు గాను నోవాటెల్‌లో ఏప్రిల్ 12న స‌క్సెస్ మీట్‌ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వేడుక‌కి ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. ఇటీవ‌ల ఫ్యామిలీతో క‌లిసి రంగ‌స్థ‌లం స్పెష‌ల్ షో చూసిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తొలి ప్రేమ త‌ర్వాత తాను ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చొని చూసిన చిత్రం రంగ‌స్థ‌లమే అని అన్నాడు. సినిమాకి సంబంధించిన విశేషాల‌ని స‌క్సెస్ మీట్ లో మాట్లాడుతాన‌ని ఆయ‌న చెప్పిన విష‌యం తెలిసిందే. రంగ‌స్థ‌లం చిత్రంకి మ్యూజిక్‌తో పాటు చంద్ర‌బోస్ లిరిక్స్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, ప్ర‌కాశ్‌రాజు, అన‌సూయ ప‌ర్‌ఫార్మెన్స్ కూడా సినిమా విజ‌యంలో భాగం అయ్యాయి. మార్చి 30న విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లోనే కాక విదేశాల‌లోను విజ‌య దుందుభి మ్రోగిస్తుంది.

6090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles