జ‌న‌సేన అధికారిక కార్య‌క్ర‌మాలు రద్దు చేసిన ప‌వ‌న్‌

Wed,August 29, 2018 12:37 PM
pawan condolences to hari krishna

సినీ న‌టుడు, మాజీ మంత్రి నంద‌మూరి హరికృష్ణ ఈ రోజు తెల్ల‌వారుజామున కారు ప్ర‌మాదంలో మృత్యువాత పడిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. తాజాగా సినీ న‌టుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతాపం తెలిపారు. గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారు అనుకునేలోగా చనిపోయార‌నే విషాద వార్త వినాల్సి వ‌స్తుంద‌ని అస్స‌లు అనుకోలేద‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ రోజు జ‌న‌సేన కార్యాల‌యంలో ముఖ్య నాయ‌కుల చేరిక‌లు, గిడుగు రామ్మూర్తి జ‌యంతి వేడుక‌ల‌ని ర‌ద్ధు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. వారి కుటుంబ స‌భ్యులు ధైర్యంగా ముందుకు వెళ్ళే శ‌క్తి ఇవ్వాల‌ని త‌న త‌ర‌పున‌, జ‌న‌సేన శ్రేణుల త‌ర‌పున భ‌గ‌వంతుడిని ప్రార్దించారు ప‌వ‌న్‌.3715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS