'మా' ఛాంబ‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర‌స‌న‌

Fri,April 20, 2018 12:16 PM
pawan at dilm chamber

త‌న‌తో పాటు త‌న త‌ల్లిని దూషించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మా చాంబ‌ర్‌లో నిర‌స‌న చేప‌ట్టారు. కొద్ది సేప‌టి క్రితం త‌ల్లితో ఫిలిం ఛాంబ‌ర్ చేరుకున్న ప‌వ‌న్ .. మా అధ్య‌క్షుడు శివాజీ రాజా, సోద‌రుడు నాగబాబు, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, ప‌లువురు లాయ‌ర్స్‌తో క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. మీడియా వ్య‌వ‌హార‌శైలిని దుయ్య‌ప‌డుతూ ప‌వ‌న్ ఈ నిర‌స‌న చేప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. త‌న‌కి న్యాయం జరిగే వ‌ర‌కు చాంబ‌ర్ నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌న‌ని ప‌వ‌న్ అన్నార‌ట‌. ప‌వ‌న్‌కి మ‌ద్దతుగా ప‌ర‌చూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, న‌రేష్‌, మెహ‌ర్ ర‌మేష్ త‌దిత‌రులు ఫిలిం ఛాంబ‌ర్ చేరుకున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ ఫిలిం ఛాంబ‌ర్‌లో ఉన్నార‌ని తెలుసుకున్న అభిమానులు, కార్య‌కర్తలు భారీ ఎత్తున అక్క‌డికి చేరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో ప‌వ‌న్ కాని లేదంటే నాగ బాబు కాని మీడియాతో మాట్లాడ‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే గ‌త రాత్రి త‌న ఫ్యామిలీపై అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేసిన వారికి వ్య‌తిరేఖంగా ప‌వ‌న్ వ‌రుస ట్వీట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

4763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS