ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ చీఫ్ గెస్ట్..

Thu,March 22, 2018 07:15 PM
Pawan as Chief guest to Chal mohana ranga pre release event


హైదరాబాద్ : టాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఛల్ మోహన రంగ. కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తోంది. ఛల్ మోహనరంగ ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 25న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పవన్‌కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడట. ఈ విషయాన్ని నితిన్ వెల్లడించాడు. ప్రీ రిలీజ్‌కు అంతా రెడీ అయింది. ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్ ముఖ్యఅతిథిగా వస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ గా ఉందని నితిన్ తెలిపాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీని పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

3571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles