బాహుబలి2 లో పవన్ విలన్

Sat,March 11, 2017 10:49 AM
pavan villain in baahubali2

గబ్బర్ సింగ్ సీక్వెల్ గా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో బాబీ తెరకెక్కించిన చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించి మెప్పించిన నటుడు శరద్ కేల్కర్. ఈ దక్షిణాది హీరోకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగు సినిమా చరిత్రని ఖండాతరాలు దాటించిన బాహుబలి సినిమాలోను ఈ నటుడు ఓ పార్ట్ అయ్యాడు. బాహుబలి చిత్రం హిందీలోను విడుదల కాగా, ఈ సినిమాలో ప్రభాస్ వర్షెన్ కి శరద్ కేల్కరే డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ చిత్రం హిందీ వర్షెన్ కి కూడా శరదే డబ్బింగ్ చెప్పాడు. ఈ క్రమంలో తాను రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ బాహుబలి సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నా.. రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తోంది అంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుండగా ట్రైలర్ ని మార్చి 15న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆడియో వేడుకను మార్చి 25న జరపాలని భావిస్తున్నారు.


2968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles