క‌న్న‌డ క్వీన్ బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిపిన కాజ‌ల్, త‌మ‌న్నా

Thu,June 7, 2018 10:52 AM
parul yadav birthday celebrations at mysoor

బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ క్వీన్ సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్, తెలుగులో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్స్ తో రూపొందుతుంది. బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ను నిర్మాత త్యాగరాజన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్ర సీన్స్ కొన్ని నీల‌కంఠ తెర‌కెక్కించ‌గా , ప‌లు కార‌ణాల వ‌ల‌న మ‌ధ్య‌లో చిత్ర షూటింగ్‌కి బ్రేక్ పడింది. తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ప్ర‌స్తుతం క్వీన్ రీమేక్ మైసూర్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా, సెట్స్‌లో కన్న‌డ భామ పారుల్ యాద‌వ్ బ‌ర్త్‌డేలు నిర్వ‌హించారు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌మ‌న్నా. బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. క్వీన్ రీమేక్ మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో జరిగింది. అ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగు వ‌ర్షెన్‌ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. త‌మ‌న్నాతో పాటు ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన సీన్స్ ప్ర‌శాంత్ వ‌ర్మ షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.ఈ మూవీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మేల్ లీడ్ చేస్తున్నాడు.మైసూర్ త‌ర్వాత యూర‌ప్‌లో చిత్ర మేజ‌ర్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ‌ని అక్క‌డే పూర్తి చేయ‌నున్నార‌ని టాక్.



2488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles