పెండ్లి తేదీ ప్రకటించిన నటి

Tue,September 18, 2018 08:07 PM
Parul chauhan announced her marriage date

ముంబై: ప్రముఖ టీవీ నటి పారుల్ చౌహాన్, సినీ నటుడు చిరాగ్ ఠక్కర్ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. పారుల్ చౌహాన్ తన పెండ్లి తేదీని స్వయంగా ప్రకటించింది. కుటుంబ సభ్యులు నా పెండ్లి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఒక్కరు పెండ్లి ప్రశ్నే వేస్తున్నారు. ఎట్టకేలకు నేను ఒప్పుకున్నా. ఆ సమయం వచ్చేసింది.. నేను డిసెంబర్ 12న చిరాగ్ ఠక్కర్‌ను వివాహం చేసుకోబోతున్నా. అయితే వివాహ వేదిక ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. నా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో పెండ్లి వేడుక చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్ ఆలోచన చేస్తున్నామంటూ పెండ్లిపై స్పష్టత ఇచ్చింది పారుల్ చౌహాన్.

11454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles