అనుష్క‌.. మ‌రి ఇంత‌గా భ‌య‌పెట్టిస్తున్నావేంటి ?

Fri,February 23, 2018 11:05 AM
అనుష్క‌.. మ‌రి ఇంత‌గా భ‌య‌పెట్టిస్తున్నావేంటి ?

బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ న‌టించిన‌ తాజా చిత్రం ప‌రి. ప్రోసిత్ రాయ్‌ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప‌రంభ్ర‌త చ‌ట‌ర్జీ, రజ‌త్ క‌పూర్, రిత‌బ్ర‌య్ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య పాత్ర‌లు పోషించారు. మార్చి 2న ఈ చిత్రం విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ విడుద‌ల చేస్తూ ప‌రి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్నారు. హ‌ర‌ర్ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఎఫెక్ట్స్ ఊహ‌కంద‌ని రీతిలో ఉంటాయ‌ని తెలుస్తుంది. అయితే తాజాగా అనుష్కకి సంబంధించి పోస్ట‌ర్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్స్‌లో మొహంపై నెత్తుటి మ‌ర‌క‌ల‌తో భ‌యంక‌రంగా క‌నిపిస్తుంది అనుష్క. ఎప్పుడు బబ్లీ గర్ల్ గా, ప్రేమించే పాత్రల్లో కనిపించే అనుష్క‌ ఇందులో మాత్రం ఊహలకు అందని రీతిలో భయపెట్టే అవతారంతో అభిమానుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇక టీజ‌ర్‌లో చేప‌ల‌తో నిండిన కొల‌ను వైపు న‌డుచుకుంటూ వెళుతున్న‌ట్టుగా చూపించారు. ఏదేమైన చిత్రానికి సంబంధించి వ‌స్తున్న అప్‌డేట్స్ మాత్రం ఫ్యాన్స్‌లో సినిమాపై చాలా ఆసక్తిని పెంచుతున్నాయి. అనుష్క శ‌ర్మ భ‌ర్త విరాట్ కూడా ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్న‌ట్టు ఇటీవ‌ల తెలిపిన సంగ‌తి తెలిసిందే. ప‌రి చిత్రం అనుష్క నిర్మాణంలో రూపొందింది. సుయి ధాగా అనే చిత్రంతో బిజీగా ఉన్న అనుష్క షారూఖ్ మరుగుజ్జు గా న‌టిస్తున్న జీరో మూవీలోనూ న‌టిస్తున్న‌ది .

2039

More News

VIRAL NEWS