పెళ్లి పీట‌లెక్క‌నున్న మ‌రో బాలీవుడ్ భామ‌

Sat,December 15, 2018 11:51 AM
Parineeti Chopra to tie the knot with rumoured beau

బాలీవుడ్ హీరోయిన్స్ వ‌రుస‌గా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఈ ఏడాది అనుష్క శ‌ర్మ ఆ త‌ర్వాత సోన‌మ్ క‌పూర్ ఏడ‌డుగులు వేసారు. ఇక రీసెంట్‌గా దీపికా ప‌దుకొణే, ప్రియాంక చోప్రా, శ్వేతా బ‌సులు త‌మ‌కి న‌చ్చిన వారిని వివాహం చేసుకొని భార్య‌ ప్ర‌మోష‌న్ అందుకున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రో బాలీవుడ్ భామ పెళ్ళి పీట‌లెక్క‌నుంద‌ని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణితీ చోప్రా కొద్ది రోజులుగా చారిట్ దేశాయ్ అనే వ్య‌క్తితో డేటింగ్‌లో ఉంద‌ట‌. కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన చారిట్ .. క‌ర‌ణ్ జోహార్ అగ్నీప‌థ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌ర‌ని తెలుస్తుంది.ఇటీవ‌ల ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్‌ల వివాహానికి చారిట్ దేశాయ్ హాజ‌రు కాగా, ప‌రిణితీ త‌న బాయ్ ఫ్రెండ్‌ని కుటుంబ స‌భ్యుల‌కి ప‌రిచ‌యం చేసిందట‌. ప‌రిణితీ ఫ్యామిలీకి ఆ వ్య‌క్తి న‌చ్చ‌డంతో త్వ‌ర‌లోనే వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. మ‌రి వీరి వివాహంపై అఫీష‌య‌ల్ ప్రక‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

3287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles