గాసిప్స్‌ను కొట్టిపారేసిన పరిణీతి చోప్రా

Fri,June 30, 2017 06:09 PM


ముంబై; బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు, గోల్‌మాల్ అగెయిన్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్వీన్ డైరెక్టర్ వికాస్ బాల్ తో కలిసి మూవీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను పరిణీతి చోప్రా కొట్టిపారేసింది. పరిణీతి చోప్రా ఇటీవలే బాంద్రాలో జరిగిన ఓ ఈవెంట్‌లో వికాస్‌తో కలిసి సందడి చేసింది. ఆ తర్వాత పరిణీతి తన కొత్త సినిమాను వికాస్ తో చేస్తున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. వీటిపై పరిణీతి క్లారిటీ ఇచ్చింది. వికాస్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న సినిమాలో నేను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కావు. బాంద్రాలో నేను వికాస్‌తో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నా. దీంతో ఆడియెన్స్ వికాస్ డైరెక్షన్‌లో సినిమాకు సైన్ చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి వికాస్‌తో సినిమా చేయడం లేదు. హృతిక్‌రోషన్ తో కలిసి కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టనున్న వికాస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది పరిణీతి. కంగనారనౌత్ లీడ్ రోల్‌లో వచ్చిన క్వీన్ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

3573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles