గల్లీ గల్లీకొస్తాడోయ్ ‘పేపర్‌బాయ్’..టైటిల్ సాంగ్ విడుదల

Thu,August 23, 2018 07:24 PM
Paperboy movie Title track revealed today

హైదరాబాద్: దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం పేపర్‌బాయ్. జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ రోడ్ ట్రిప్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా పేపర్ బాయ్ నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. కాళ్లకు చక్రం కట్టుకుని..చేతిలో పేపర్ పట్టుకుని గల్లీ గల్లీకొస్తాడోయ్ పేపర్‌బాయ్ అంటూ సాగే పాట అద్భుతంగా ఉంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. సంపత్‌నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బీఎల్‌ఎన్ పతాకాలపై సంపత్‌నంది, వెంకట్ నరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాన్య హోప్, రియా సుమన్ హీరోయిన్లుగా నటిస్తున్న పేపర్‌బాయ్ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

2690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles